: అదృశ్య‌మైన‌ వ్యక్తి.. కొండచిలువ కడుపులో కనిపించాడు!


పొలం ప‌నులు చేస్తూ ఓ రైతు ఉన్న‌ట్టుండి మాయ‌మైపోయాడు.. అయితే, అనుమానం వ‌చ్చిన స్థానికులు ఓ కొండ‌చిలువ క‌డుపును కోసి చూస్తే అందులో క‌నిపించాడు. ఇండోనేషియా తూర్పు సులావేసి దీవులలోని సలుబిరో గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే... 25 ఏళ్ల రైతు అక్బర్ నాలుగురోజుల క్రితం తన పండ్లతోటలో పని చేసుకుంటున్నాడు. అయితే, ఒక్క‌సారిగా ఆయ‌న కనిపించ‌కుండా పోవ‌డంతో ఆయ‌న‌ కుటుంబసభ్యులు కంగారు ప‌డి అంత‌టా వెతికారు. అయితే, పండ్లతోట సమీపంలో ఓ 25 అడుగుల కొండచిలువ భారీగా ఉబ్బిన కడుపుతో కనిపించడంతో స్థానికులు దాని మీద దాడి చేయ‌డంతో అక్బ‌ర్ మృత‌దేహం అందులో క‌నిపించింది. 

  • Loading...

More Telugu News