: టాటూ కోసం విమానం నుంచి దూకేసింది!


పుర్రెకో బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. వినూత్నంగా చేయాలన్న కోరికతో యువతరం ప్రాణాలకు తెగించే సాహసాలు చేస్తోంది. కెనడాకు చెందిన నడైన్‌ ఇలైనే అనే మహిళ స్కైడైవ్ చేస్తూ టాటూ వేయించుకోవాలని భావించింది. దీంతో పలువురు స్కైడైవర్ల సాయంతో ఆమె సాహసానికి పూనుకుంది. దీంతో కెనడాకు చెందిన టాటూ ఆర్టిస్ట్‌ షన్నన్‌ క్లేడన్‌ స్కైడైవింగ్‌ చేస్తూనే నడైన్ ఇలైనేకు టాటూ వేశాడు. విమానం నుంచి వీరిద్దరూ దూకిన అనంతరం వారిని స్కైడైవర్లు గట్టిగా కదలకుండా పట్టుకోవడంతో 120 మైళ్ల వేగంతో కిందికి జారిపడుతూ ‘ఏహెచ్‌హెచ్‌హెచ్‌’ అనే ఆంగ్ల అక్షరాలు ఆమె చేతిపై ఏఏ బ్యాటరీలతో పనిచేసే పోర్టబుల్‌ టాటూ గన్‌ తో చిత్రించాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

  • Loading...

More Telugu News