: అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయని ఆటగాడు ఈ రోజు వికెట్ తీశాడు!
అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయని ఆటగాడు అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ లో వికెట్ తీసిన ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్, రంజీల్లో రాణించిన శ్రేయస్ అయ్యర్ ను ధర్మశాల టెస్టుకు కోహ్లీ స్థానంలో స్టాండప్ బ్యాట్స్ మన్ గా ఎంపిక చేశారు. సామాన్య ఆటగాడు ఎవరైనా విశ్రాంతి కోరితే స్టాండప్ బ్యాట్స్ మన్ ఫీల్డింగ్ చేసే వెసులుబాటు ఉంది. జట్టు సభ్యులైన పదకొండు మందిలో ఒకడు కాదు కాబట్టి, శ్రేయస్ అయ్యర్ ఇంకా అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేయనట్టే లెక్క.
ఇక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో మాత్రమే తను ఆడాడు. ఈ మధ్యే జరిగిన ఆసీస్, ఇండియా ఏ జట్టులో ఆడి, సెంచరీతో రాణించాడు. అయితే ఆ మ్యాచ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ పరిధిలోకి వస్తుంది తప్ప అంతర్జాతీయ టెస్టులోకి రాదు. దీంతో శ్రేయస్ అయ్యర్ ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే మూడో సెషన్ లో ఉమేష్ యాదవ్ స్థానంలో సబ్ స్టిట్యూట్ గా బరిలోకి దిగాడు. షార్ట్ మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తుండగా, ఆసీస్ స్పిన్నర్ ఒకీఫ్ బంతిని షార్ట్ లెగ్ వికెట్ దిశగా బంతిని మళ్లించి సింగిల్ కు ప్రయత్నించాడు. మెరుపువేగంతో కదిలిన శ్రేయస్ అయ్యర్ నేరుగా బంతిని సాహాకు అందించి రన్ అవుట్ కు కారణమయ్యాడు. దీంతో ఇంకా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయని శ్రేయస్ అయ్యర్ పేరు ఒకీఫ్ ను అవుట్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కింది.