: అధికారుల తప్పులకు మేం మాటలు పడాల్సివస్తోంది!: టీడీపీ ఎంపీ కేశినేని నాని
ఫిర్యాదు చేయడానికి వచ్చిన టీఎన్‌టీయూసీ కార్యకర్తలను ఆర్టీఏ సిబ్బంది బయటకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని విజయవాడ ఆర్టీఏ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులకు నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్లు ఇస్తున్నారని, అధికారులు డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ప్రమాదాలు జరిగితే సర్కారుపై నిందలు వేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తప్పులు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి తమని విమర్శిస్తున్నాడని, వారు చేసిన తప్పుకు తాము మాటలు పడాలా? అని నిలదీశారు.