: 'బాహుబలి-2' విడుదలయ్యే థియేటర్ల సంఖ్య ఫిక్స్!
ప్రపంచ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న 'బాహుబలి-2' చిత్రాన్ని ఇండియాలో 6,500, విదేశాల్లో 1000 థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్టు సమాచారం. గతవారం విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన రావడంతో థియేటర్ల సంఖ్యను పెంచాలని భావించిన నిర్మాతలు ఈ మేరకు మరిన్ని థియేటర్లను తీసుకున్నారని తెలుస్తోంది.
కాగా, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే నెల 28న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. సరాసరిన ఒక్కో థియేటరులో 400 మంది ప్రేక్షకులు రూ. 100 చెల్లించి చిత్రాన్ని చూస్తారనుకుంటే, రోజుకు నాలుగు షోలు వేసిన పక్షంలో తొలి రోజు కలెక్షన్ రూ. 120 కోట్లు చేరుకుని, కలెక్షన్ల సునామీ సృష్టించడంతో పాటు కొత్త రికార్డులు నమోదవుతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.