: ఉత్తరకొరియా నియంతకు షాక్ .. తాజా క్షిపణి పరీక్ష విఫలం


వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికా, జపాన్, దక్షిణకొరియాలకు దడ పుట్టిస్తున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కు షాక్ తగిలింది. ఆ దేశం పరీక్షించిన కొత్త క్షిపణి ఫెయిల్ అయింది. క్షిపణి లాంచ్ అయిన సెకన్ల వ్యవధిలోనే విఫలమయింది. ఈ ఉదయం వాన్ సాన్ ఎయిర్ బేస్ నుంచి ఈ క్షిపణిని పరీక్షించింది నార్త్ కొరియా. క్షిపణి పరీక్ష విఫలమయినట్టు దక్షిణకొరియా రక్షణశాఖ తెలిపింది. ఇది ఏ రకమైన క్షిపణో పరిశీలిస్తున్నామని దక్షిణకొరియా రక్షణ అధికారి తెలిపారు.

ఉత్తరకొరియా క్షిపణి పరీక్షల గురించి జపాన్ వార్తా సంస్థ క్యోడో కూడా స్పందించింది. ఈ ఉదయం నుంచి వాన్ సాన్ నుంచి వివిధ రకాల క్షిపణులను ఉత్తరకొరియా లాంచ్ చేసినట్టు క్యోడో వెల్లడించింది. 

  • Loading...

More Telugu News