: చంద్రబాబు, యనమలే నా మీద కేసులు పెట్టారు: జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడే తనపై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తనపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. రూ. 43 వేల కోట్లు సంపాదించానని ఆరోపిస్తున్నారని... అందులో 10శాతం ఇస్తే... తాను ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడతానని అన్నారు. జగన్ కు చెందిన రూ. 43 వేల కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిందని... ఆయన తండ్రి సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రశ్నించిన తర్వాత జగన్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.