: నా భార్యతో గొడవలు లేవు... మనసు మార్చుకున్న దీపా జయకుమార్ భర్త మాధవన్
తన భార్యతో ఎలాంటి గొడవలు లేవని, తాను మరో రాజకీయ పార్టీని పెట్టనున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని దివంగత జయలలిత మేనకోడలు దీప భర్త మాధవన్ ప్రకటించారు. తమను చూసి భయపడుతున్న వారే ఇటువంటి ప్రచారం మొదలు పెట్టారని ఆరోపించిన ఆయన, దీపను సీఎంగా చేసేందుకే 'ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై' పార్టీని పెట్టామని అన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కార్యకర్తలతో చర్చించి ప్రకటన చేస్తామని అన్నారు. కాగా, దీప నుంచి మాధవన్ విభేదించి బయటకు వచ్చారని, త్వరలో ఇంకో కొత్త పార్టీ పెట్టనున్నారని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.