: ఢిల్లీ మాజీ మంత్రి డిగ్రీ నకిలీదిగా గుర్తింపు!


ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు జితేందర్ సింగ్ తోమర్ న్యాయశాస్త్రంలో డిగ్రీ నకిలీదిగా గుర్తించారు. ఈ మేరకు భాగల్పూర్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటన చేసింది. జితేందర్ సింగ్ న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసినట్టుగా పేర్కొన్న ఆ డిగ్రీ నకిలీదని స్పష్టం చేసింది. కాగా, 2015 లో ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ నేతలు నకిలీ డిగ్రీలను సంబంధిత పత్రాలకు జతపర్చారు. ఈ విషయమై బీజేపీ నేత నంద కిషోర్ గార్గ్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. దీంతో, జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ వ్యవహారం బయటపడింది. జితేందర్ సింగ్ పై పలు సెక్షన్ల కింద క్రిమినల్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News