: మమతా బెనర్జీకి గట్టి షాక్.. టీఎంసీ నేతల కేసు విచారణ సీబీఐకి అప్పగింత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో షాక్ తగిలింది. గత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు టీఎంసీ నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్యవహారాన్ని నారదా న్యూస్ చానల్ రెండు సీడీల రూపంలో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు ఈ రోజు కలకత్తా హైకోర్టు ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టు నిర్ణయించింది. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ... అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని పేర్కొంది.
హైకోర్టు నిర్ణయంపై స్పందించిన మమతా బెనర్జీ.. ఈ ఆ సీడీలు భారతీయ జనతా పార్టీ ఆఫీసు నుంచి ప్రసారం అయ్యాయన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తాను ఈ అంశంపై ఇప్పుడేమీ మాట్లాడబోనని చెప్పారు. ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తానని చెప్పారు.