: ఉప్పల్ లోని ‘హెరిటేజ్’లో అగ్నిప్రమాదం!


హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న హెరిటేజ్ సంస్థ అవుట్ లెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News