: ఇది దేవుడికి సంబంధించిన విషయం అధ్యక్షా... పాపం చుట్టుకుంటుంది!: జగన్


ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టే ముందు అసెంబ్లీలో ప్రశోత్తరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా దేవాదాయ భూములను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ విద్యాసంస్థకు అతి తక్కువ ధరకే కట్టబెట్టిందంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. రూ. 70 కోట్ల విలువ చేసే భూములను కేవలం ఎకరాకు లక్షన్నర రూపాయలకే మరో 33 ఏళ్లపాటు సిద్ధార్థ మెడికల్ కాలేజీకి లీజుకు ఇచ్చారని... ఇది ధర్మమేనా? అని ప్రశ్నించారు. చట్టం ప్రకారం భూమి మార్కెట్ విలువలో కనీసం 10 శాతానికి లీజుకు ఇవ్వాలని... అంటే. రూ. 7 కోట్లకు ఇవ్వాలని చెప్పారు.

ఇదే సమయంలో సదావర్తి భూముల గురించి జగన్ మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ కలగజేసుకొని మీరు అడిగిన ప్రశ్నకు మంత్రి సవివరంగా సమాధానం చెప్పారని... ప్రశ్నోత్తరాల సమయంలో అనవసరంగా టైమ్ వృథా చేయకూడదని సూచించారు. దీంతో జగన్ స్పీకర్ మాటను వినకుండా, తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, 'అధ్యక్షా! ఇది దేవుడికి సంబంధించిన విషయం... పాపం చుట్టుకుంటుంది' అంటూ తన వాదనను కొనసాగించారు.

  • Loading...

More Telugu News