: ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద మృతి!
ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ (58) ముంబైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జయసుధ హుటాహుటిన ముంబై బయలుదేరి వెళ్లింది. నితిన్ కపూర్ ముంబయిలోని తన నివాసంలో చనిపోయారు. అయితే, ఎలా చనిపోయారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది. జయసుధ కుటుంబం గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం.
జయసుధ, నితిన్ కపూర్ దంపతులకు నిహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో శ్రేయాన్ హీరోగా ఇటీవలే పరిచయమయ్యాడు. కాగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్రకు వరుసకు నితిన్ కపూర్ సోదరుడు అవుతారు. 1985లో జయసుధ, నితిన్ కపూర్ ల వివాహం జరిగింది. పలు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. జయసుధ హీరోయిన్ గా నితిన్ కపూర్ చాలా సినిమాలను నిర్మించారు. ‘ఆశాజ్యోతి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా నితిన్ కపూర్ పని చేశారు. హ్యాండ్సప్, కలికాలం, మేరా పతి సిర్ఫ్ మేరా హై సినిమాలను జేఎస్కే కంబైన్స్ పేరుతో నితిన్ కపూర్ నిర్మించారు.