: క్రికెట్‌లో అరుదైన చిత్రం.. ఒకే మ్యాచ్‌లో తండ్రీ కొడుకులు!


ఒకే మ్యాచ్‌లో తండ్రీ కొడుకులా?.. అదెలా సాధ్యం? అన్న ప్రశ్న తలెత్తితే ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే 30 ఏళ్లకే ఫిట్‌నెస్ కోల్పోయే క్రికెట్‌లో తండ్రీ కొడుకులు.. అందులోనూ ఒకే టీంలో సభ్యులుగా ఉండడం నిజంగా అరుదైన ఘటనే. ఇప్పటి వరకు అన్నదమ్ములు కలిసి ఆడగా చూసిన వారు తండ్రీ కొడుకులు కలసి క్రీజులోకి దిగి బ్యాట్ ఝళిపిస్తుంటే ప్రేక్షకులు అలా కన్నార్పకుండా చూస్తుండిపోయారు.

వెస్టిండీస్ దేశవాళీ క్రికెట్‌లో ఈ అసాధారణ దృశ్యం చోటుచేసుకుంది. గయానా తరపున బరిలోకి దిగిన దిగ్గజ ఆటగాడు శివ్‌నారాయణ్ చందర్‌పాల్, కొడుకు త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్‌ కలిసి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో బరిలోకి దిగారు. జమైకాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన కొడుకు త్యాగ్‌నారాయణ్ 58 పరుగులు చేస్తే, ఐదో స్థానంలో వచ్చిన తండ్రి శివ్‌నారాయణ్ 57 పరుగులు చేసి సత్తా చాటాడు. అంతేకాదు, ఇద్దరూ కలిసి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News