పాఠ్యాంశంగా భగవద్గీత.. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాఠ్యాంశంగా భగవద్గీత.. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ

పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చాలంటూ బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి శుక్రవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అందించేందుకు పాఠ్యాంశాల్లో భగవద్గీతను  తప్పనిసరి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా శుక్రవారం లోక్‌సభలో మొత్తం 103 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. మహిళలపై జరిగే దాడులపై వేగవంతమైన విచారణ కోసం ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఓ బిల్లును ప్రవేశపెట్టగా బీజేపీ సభ్యుడు మహేశ్ గిరి పారిశుద్ధ్య నిర్వహణ బిల్లును ప్రవేశపెట్టారు.

More Telugu News