: నోట్ల మార్పిడి కేసులో... ప్రముఖ పారిశ్రామికవేత్తకు బెయిల్


పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడి కేసులో అరెస్టైన ప్రముఖ పారిశ్రామికవేత్త పరస్ మల్ లోధాకు సీబీఐ కోర్టు 21 రోజుల పాటు బెయిలు మంజారు చేసింది. ఆయన తల్లి మృతి చెందడంతో ఆయనకు బెయిల్ మంజూరయింది. చెన్నైకు చెందిన శేఖర్ రెడ్డికి పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారంలో లోధా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఆయనను ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన పుళల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. లోధా కోల్ కతాకు చెందిన వారు. బుధవారం నాడు ఆయన తల్లి మరణించారు. దీంతో, ఆయన అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే, లోధా వెంట ఓ సీబీఐ అధికారి కూడా వెళ్లాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News