: ఎమ్మెల్యే రోజాను చూస్తే చంద్రబాబుకు వణుకు పుడుతుంది: బాలినేని శ్రీనివాస్


ఎమ్మెల్యే రోజాను చూస్తే సీఎం చంద్రబాబు నాయుడుకు వణుకు పుడుతోందని ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యనించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందుకే, రోజాను అసెంబ్లీకి రానీయకుండా మరోసారి అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న జేసీ బ్రదర్స్ పై కూడా ఆయన మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని బాలినేని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News