: గుజరాత్ అసెంబ్లీ ముందు కలకలం.. హోం మంత్రిపై షూ విసిరిన యువకుడు
గుజరాత్ అసెంబ్లీ ముందు ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడు అలజడి రేపాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన హోం మంత్రిపైనే ఆయన దాడి చేసి దుస్సాహసం చేశాడు. ఈ రోజు ఆ రాష్ట్ర హోం మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా గాంధీనగర్‌లోని అసెంబ్లీ ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ యువకుడు తన షూ తీసి మంత్రిపై విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఆ యువకుడు గట్టిగా పలు నినాదాలు చేశాడు.