: తెలుగువారి ప్రతిభను చూసి అమెరికాలో కొందరు ఓర్వలేకపోతున్నారు: చంద్రబాబు


అమెరికాలో తెలుగువారిపై జరుగుతున్న దాడుల అంశంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ఈ రోజు గుంటూరులో పెన్షనర్స్ అసోషియేషన్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... తెలుగువారిపై జరుగుతున్న వరుస దాడులు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. ఈ విష‌యంలో ప్రధాని న‌రేంద్ర‌ మోదీ స్పందించి అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయ‌న అన్నారు. తెలుగువారి ప్రతిభను చూసి అమెరికాలో కొందరు ఓర్వలేకపోతున్నారని, అందుకే దాడుల‌కు దిగుతున్నార‌ని వ్యాఖ్యానించారు. తెలుగువాళ్లు అమెరికా వెళ్లి బాగా కష్టపడి, తెలివితేటలతో ఆ దేశం అభివృద్ధి కోసం కృషి చేశారని చంద్ర‌బాబు పేర్కొన్నారు. దాడుల‌ను నివారించాల్సిన బాధ్యత అమెరికాపై ఉందని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News