: నాలుగో దశలో సోనియా ఇలాకాలో పోలింగ్... 186 మంది కోటీశ్వరుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు

ఉత్తరప్రదేశ్ లో నాలుగో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ దఫా సోనియా సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీ సహా 12 జిల్లాల్లో 23న పోలింగ్ జరగనుండగా, మొత్తం 680 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 189 మంది కోటీశ్వరులు ఉన్నారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. బీఎస్పీ నుంచి 45 మంది, బీజేపీ నుంచి 36 మంది, సమాజ్ వాదీ నుంచి 26, కాంగ్రెస్ నుంచి 17, ఆర్ఎల్డీ నుంచి 6, ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో 25 మంది కోటీశ్వరులు ఉన్నారని తెలిపింది. 116 మందిపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, 171 మంది అభ్యర్థులు తమ పాన్ కార్డు వివరాలు వెల్లడించలేదని తెలిపింది. ఇక ఇంటర్ లోపు విద్యార్హతలున్న వారు 268 మంది, డిగ్రీ చదివిన వారు 367 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, 50 సంవత్సరాలలోపు వారు 493 మంది ఉన్నారు. బరిలో ఉన్న 680 మందిలో 60 మంది మహిళలు. నేడు యూపీలో మూడో దశ పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News