: రేపు ఉదయం శశికళను కలవనున్న ముఖ్యమంత్రి పళనిస్వామి?


తమిళనాడు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి రేపు ఉదయం బెంగళూరుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో కర్ణాటక జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను కలిసేందుకు ఆయన వెళతారని సమాచారం. రేపు ఉదయం పది గంటలకు శశికళను కలవనున్న ఆయన, పలు అంశాలపై ఆమెతో నిశితంగా చర్చిస్తారని, సోమవారం నాడు బలనిరూపణకు సంబంధించి చిన్నమ్మ సూచనలు ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శశికళను కలిసేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు మంత్రి వర్గ సహచరులు కూడా వెళతారని తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News