: ఇంత ఘోరమేంటి?... లొంగిపోయేందుకు సమయం కూడా ఇవ్వరా?: పోలీసులపై శశికళ తీవ్ర ఆగ్రహం
తనను అరెస్ట్ చేయాలని రిసార్టు వద్దకు వచ్చిన పోలీసు అధికారులపై శశికళ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిసార్టు బయట భారీగా పోలీసులు మోహరించిన తరువాత, ఓ అధికారి లోపలికి వెళ్లి లొంగిపోయే విషయంలో శశికళ అభిప్రాయాన్ని కోరగా, ఆమె కోపంతో విరుచుకుపడ్డట్టు సమాచారం. మహిళనని కూడా చూడకుండా ఇంత ఘోరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన ఆమె, లొంగిపోయేందుకు కోర్టు తనకు నాలుగు వారాల సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. తనకు కోర్టులో లొంగిపోయే హక్కు ఉందని, పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని అడిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆమె, కనీసం కోర్టు తీర్పు కాపీ కూడా ఇంకా తనకు అందలేదని, ఇప్పుడే అరెస్టులేంటని విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. ఆమె వైఖరితో సదరు అధికారి బయటకు వచ్చి, ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వారి నుంచి తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్టు తెలిసింది.