: ఓ మంచి నిర్ణయం తీసుకుందాం: సుప్రీంకోర్టు తీర్పుపై పార్టీ నేతలకు పన్నీర్ లేఖ
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం తమ పార్టీ నేతలకు లేఖ రాశారు. అన్నాడీఎంకేలో వివాదాలు తాత్కాలికమేనని, తామంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన సూచించారు. పార్టీ విడిపోతుందని తమ ప్రత్యర్థి పార్టీ నేతలు చూస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. పార్టీ దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఓ మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. తమ ప్రత్యర్థులు చేసే ప్రచారాన్ని నమ్మకూడదని సూచించారు.