: ఎవరికీ చెప్పా పెట్టకుండా వివాహం చేసుకున్న తమిళ హీరోయిన్ మనీషా యాదవ్


తమిళ హీరోయిన్, 'ఆదలాల్‌ కాదల్‌ సెయ్‌వీర్', 'జన్నల్‌ ఓరం', 'త్రిష ఇల్లన్న నయనతార' తదితర చిత్రాల్లో నటించిన మనీషా యాదవ్ ఎవరికీ చెప్పా పెట్టకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంది. గత కొంతకాలం నుంచి సరైన అవకాశాలు లేని ఈ అమ్మడు పెళ్లికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం తాను వలచిన బెంగళూరు వ్యాపారి వార్నిడ్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది మనీషా. ఈ పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించారని మనీషా తల్లి యమున వెల్లడించింది. కాగా, పెళ్లి తరువాత తను నటించాలా? వద్దా? అన్నది భర్త నిర్ణయంపై ఆధారపడి వుందని యమున తెలిపింది. కాగా, తనను కోలీవుడ్ కు పరిచయం చేసిన బాలాజీ శక్తివేల్ ను సైతం మనీషా పెళ్లికి పిలవలేదని సమాచారం.

  • Loading...

More Telugu News