: ఉప్పల్ టెస్టులో సెంచరీలతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, మురళీ విజయ్
బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ భారత పర్యటనలో భాగంగా ఈ రోజు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచులో టీమిండియా బ్యాట్స్ మెన్ మురళీ విజయ్, విరాట్ కోహ్లీ అదరగొట్టేశారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచులో తొలి ఓవర్లోనే టీమిండియా మొదటి వికెట్ (విజయ్ 2 పరుగులు) కోల్పోయిన విషయం తెలిసిందే. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా 83 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ విజయ్ ధాటిగా ఆడి 108 పరుగులు చేశాడు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కేవలం 130 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో రహానే(45), కోహ్లీ(111) ఉన్నారు. టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 356 పరుగులు(90 ఓవర్లు)గా ఉంది. బంగ్లాదేశ్ బౌలర్లలో టైజల్, టాస్కిన్, మెహెదిలకు చెరో వికెట్ దక్కింది.