: పన్నీర్ సెల్వానికి షాక్... శశికళ వద్దకు 130 మంది ఎమ్మెల్యేలు


నిన్నటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు తొలి షాక్ తగిలింది. ఈ ఉదయం పార్టీ కార్యదర్శి, రెండు రోజుల క్రితం శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోబడ్డ శశికళ, ఎమ్మెల్యేలను సమావేశానికి పిలువగా, ఏకంగా 130 మంది హాజరయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం వద్దకు వీరంతా చేరుకోగా, వీరితో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు శశికళ చేరుకున్నారు. శశికళ వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే, ఆమె తన బలాన్ని చాటుకున్నట్టేనని, తన వెంటే అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారని ఆమె నిరూపించుకున్నారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 134 కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పార్టీలో శశికళ ఆధిపత్యానికి తిరుగులేనట్టే.

  • Loading...

More Telugu News