: యోగా గురువుకు 2 కోట్ల విలువైన ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ భామ!


బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన యోగా గురువు సూర్యనారాయణ సింగ్ కు అత్యంత ఖరీదైన బహుమతిని ఇచ్చింది. తాను బాలీవుడ్ లోకి ప్రవేశించక ముందు నుంచి కూడా తనకు యోగా శిక్షణ ఇస్తున్న గురువుకు విలువైన గురుదక్షిణ చెల్లించుకుంది. రూ. 2 కోట్ల విలువైన ఫ్లాట్ ను కానుకగా ఇచ్చింది. ముంబైలోని అంధేరీ వెస్ట్ లోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను... యోగా కేంద్రం ప్రారంభించేందుకు బహూకరించింది. కొన్ని రోజుల క్రితం కాంట్రాక్టర్ ను సంప్రదించి... యోగా  సెంటర్ కు అనువుగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఈ ఫ్లాట్ ను రూపుదిద్దించింది కంగనా.

  • Loading...

More Telugu News