: ఆన్ లైన్లో లీకైన 'నోకియా పీ1' విశేషాలు!


స్మార్ట్ ఫోన్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'నోకియా పీ1'కు చెందిన వీడియో ఒకటి ఆన్ లైన్లో వైరల్ అవుతోంది. ఈ సంవత్సరం జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ ను ఆవిష్కరించాలని నోకియా నిర్ణయించుకోగా, ముందే వీడియో బయటకు వచ్చింది. మెటల్ ఫ్రేమ్, హైబ్రిడ్ డ్యూయల్ స్లిమ్ స్లాట్, కార్ల్ జీయిస్ లెన్స్ ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు 5.3 అంగుళాల డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్, స్నాప్ డ్రాగన్ 835 ఎస్ఓసీ, 6 జీబీ ర్యామ్, 22.6 మెగాపిక్సెల్ కెమెరా, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలున్నాయి. ఈ ఫోన్ ధరలు ఎంచుకునే స్టోరేజ్ వేరియంట్ ను బట్టి రూ. 54,500 నుంచి రూ. 64,700 మధ్య ఉంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News