నేను మేనత్త నయ్యాను.. హ్యాపీగా వుంది!: బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఆసక్తికర ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను మేనత్త నయ్యాను.. హ్యాపీగా వుంది!: బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఆసక్తికర ట్వీట్

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ మేనత్త అయింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆ అమ్మ‌డే స్వ‌యంగా చెప్పింది. తనకు మేనల్లుడు పుట్టినందుకు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా త‌న‌ అభిమానులకు ఆ విషయాన్ని తెలిపింది. త‌న‌ మేనల్లుడితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసి, త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని, తానిప్పుడు మేనత్తను అని మల్లిక త‌న ట్వీట్‌లో పేర్కొంది. సినిమాల్లో అందాలు ఒల‌క‌బోస్తూ ఎంతో మంది కుర్రాళ్ల అభిమాన తార‌గా వెలుగొందుతున్న‌ మ‌ల్లికా ష‌రావ‌త్ ఇప్ప‌టికీ త‌న అభిమానుల‌ను అల‌రిస్తోన్న విష‌యం తెలిసిందే.


Mallika Sherawat ‏

More Telugu News