: ట్రంప్ నిర్ణయంతో నా గుండె బద్దలైంది!: మలాలా


ముస్లిం శరణార్థులను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనను కలచివేసిందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాక్ సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ తెలిపింది. ట్రంప్ నిర్ణయంతో తన గుండె పగిలి పోయిందని చెప్పింది. ఎలాంటి ఆశ్రయం లేని వారిని నిషేధించడం సరికాదని తెలిపింది. శరణార్థులను ఆదరించాలని కోరింది.

2014లో భారత్ కు చెందిన కైలాశ్ సత్యార్థితో పాటు మలాలా నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ఈ అవార్డును అతి చిన్న వయసులోనే అందుకున్న ఘనతను సాధించింది. 2012లో మలాలాపై తాలిబన్లు దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ఇంగ్లండ్ లో ఆశ్రయం పొందుతోంది.

  • Loading...

More Telugu News