జల్లికట్టు సక్సెస్ ఎఫెక్ట్: ఎడ్ల బండ్ల పందేల కోసం పోరాడ‌తామ‌ని ప్ర‌క‌టించిన శివసేన

తమిళనాడులో పెద్ద ఎత్తున జ‌రిగిన‌ జల్లికట్టు పోరాటం సక్సెస్ నేప‌థ్యంలో కర్ణాటకలో కంబళ పోటీని చట్టబద్ధం చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందేలకు అనుమతి పొందేందుకు పోరాడ‌తామ‌ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముంబైలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించారు. మ‌రోవైపు భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి ఎన్నిక‌ల్లో ముందుకు వెళ్లబోమ‌ని తెలిపారు. త్వరలోనే జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీతోనే కాక‌ ఎవరితోనూ పొత్తు పెట్టుకోమ‌ని స్ప‌ష్టం చేశారు. అసలైన పోరు ఇప్పుడే మొదలు కాబోతోందని ఆయ‌న వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
jallikattu

More Telugu News