: ఆధార్ కార్డు మాదిరిగా శుభలేక... భలేవుందే అనిపిస్తున్న వెడ్డింగ్ ఇన్విటేషన్


ఓ వినూత్న ఆలోచన వస్తే, అది ఎంతగా చొచ్చుకుపోతుందో ఉదాహరణ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉదంతం. దేశమంతా ఆధార్ కార్డు ఆధారిత నగదురహిత చెల్లింపుల దిశగా కదులుతున్న వేళ, తన పెళ్లి శుభలేఖను సైతం ఆధార్ కార్డు మాదిరిగా తయారు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచాడో యువ న్యాయవాది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకకు చెందిన కొత్తపల్లి మూర్తి వివాహం, లక్ష్మితో ఫిబ్రవరి 1న జరగనుంది. ఇక శుభలేఖను అచ్చు ఆధార్ కార్డు మాదిరిగా తయారు చేయించాడు మూర్తి. బార్ కోడ్, ఓఆర్ కోడ్ లు పెట్టించాడు. భారత త్రివర్ణ పతాకంలోని మూడు రంగులపై ఆహ్వానాన్ని ముద్రించాడు. తనక్కాబోయే శ్రీమతితో ఉన్న చిత్రాన్ని కార్డులో ఫోటో ఉండే స్థానంలో ఉంచాడు. ఇప్పుడీ శుభలేఖ గోదావరి జిల్లాలో ఓ టాపిక్ గా మారింది. పలువురు కొత్తపల్లి మూర్తి ఆలోచనను మెచ్చుకుంటున్నారు. ఆ వినూత్న వెడ్డింగ్ కార్డు ఇదే!

  • Loading...

More Telugu News