Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘జియో’ ఆఫర్ మరో మూడు నెలల పాటు పొడిగింపు?

‘రిలయన్స్’ జియో తన ఆఫర్ ను మరో మూడు నెలల పాటు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరు నెలల పాటు ఉచిత కాల్స్, డేటా సేవలు అందిస్తున్న ‘జియో’ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, తాజాగా తీసుకురానున్న ఈ ఆఫర్ ను కేవలం రూ.100 కే అందించాలని, అలాగే జూన్ 30వ తేదీ వరకు దీనిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ ముగిసే లోగా కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోందట. కాగా,  రిలయన్స్ జియో ‘వెల్ కమ్’ ఆఫర్ పేరిట ఉచిత సేవలను ప్రారంభించడం, ఆ తర్వాత ‘హ్యాపీ న్యూ ఇయర్’ పేరిట మార్చి 31 వరకు ఆ ఆఫర్ ను పొడిగించడం తెలిసిందే. 

More Telugu News