: హైదరాబాద్ కన్నా పెద్ద నగరాన్ని నిర్మించబోతున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా, భారత్ లోనే ఉత్తమ నగరంగా, హైదరాబాద్ కన్నా పెద్ద నగరంగా నిర్మించబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. చెన్నైలో ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములను ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రంలో తొంభై శాతం మంది నోట్ల రద్దును సమర్థిస్తున్నారని మరోమారు చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా నాటి విషయాలను కూడా బాబు ప్రస్తావించారు. తనకు ప్రధాని అయ్యే అవకాశాలు రెండుసార్లు వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ అవకాశాలను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీతో తనకు సత్సంబంధాలున్నాయని చెప్పిన చంద్రబాబు, బీజేపీ కురువృద్ధుడు వాజ్ పేయితో మోదీని పోల్చవద్దని కోరారు.