ఏపీలో డాక్టర్ పోస్టుల నియామకం... దరఖాస్తుల గడువు పెంపు
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు
- దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకూ పొడిగించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ సూర్యకళ
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు 97, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 280 భర్తీకి ఈ నెల 2న వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.