: ఇకపై సెంట్రల్ పోలీస్ క్యాంటీన్లలో వోక్స్ వ్యాగన్ కార్లు
ఇకపై దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ పోలీస్ క్యాంటీన్లలో వోక్స్ వ్యాగన్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని వోక్స్ వ్యాగన్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ తెలిపారు. తమ ఉత్పత్తి విక్రయాల విస్తరణలో భాగంగా భద్రతా సిబ్బందికి సెంట్రల్ క్యాంటీన్ల ద్వారా ఈ కార్లను ప్రత్యేక ధరకు అందిస్తున్నట్లు తెలిపారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎప్ఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీ, అస్సాం రైఫిల్స్ సహా అన్ని కేంద్రబలగాల ఉద్యోగులు ప్రత్యేక ధరలకు కార్లను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. దేశంలోని రాయితీల నిచ్చే అన్ని పోలీస్ క్యాంటీన్లలోను వీటిని కొనుగోలు చేసుకోవచ్చని, అయితే, ధరలు, రాయితీలు ఆయా రాష్ట్రాలను అనుసరించి ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.