గాడిదలు చూపిన సమయస్ఫూర్తి... ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాడిదలు చూపిన సమయస్ఫూర్తి... ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్!

టీమిండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా త‌నదైన శైలిలో ప‌లు అంశాల‌పై స్పందిస్తూ త‌న ఫాలోవ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. ప‌లు వీడియోల‌ను పోస్ట్ చేస్తూ నీతిని కూడా బోధిస్తున్నాడు. తాజాగా ఆయ‌న ఓ ఆసక్తికర వీడియోను తన ట్విటర్‌ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో నాలుగు గాడిదలు ఉన్నాయి. అయితే అవి న‌డుచుకుంటూ వెళుతుండగా వాటికి పెద్ద కర్ర అడ్డుగా వ‌చ్చింది. అవి అక్క‌డే ఆగిపోలేదు. వాటిలో రెండు గాడిదలు కర్ర పైనుంచి జంప్ చేశాయి. ఈ రెండు గాడిద‌లు చేసిన ప‌నే అద్భుతంగా ఉందంటే మూడో గాడిద మ‌రో అద్భుతమ‌యిన ప‌ని చేసింది.

త‌న బుర్ర‌ను ఉప‌యోగించి కర్రపై నుంచి జంప్ చేయ‌కుండా కర్రను నోటితో పట్టుకుని కిందకు పడేసింది. అనంత‌రం ఎంచ‌క్కా ముందుకు న‌డుచుకుంటూ వెళ్లిపోయింది. అనంత‌రం దాని వెన‌కున్న గాడిద కూడా ఎటువంటి క‌ష్టం లేకుండా న‌డుచుకుంటూ వెళ్లిపోయింది. ఆ గాడిద‌లు చూసిన సమయస్ఫూర్తి నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

sehwag

More Telugu News