Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా జీవిత చరిత్రను నేనే సినిమాగా తీసుకుంటా!: దాసరి నారాయణరావు

ఎప్పటికైనా తన బయోపిక్ ను తానే తీసుకుంటానని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తెలిపారు. తన బయోపిక్ ను తీస్తామంటూ గతంలో ఒకరు వచ్చారని... అయితే, తీయడం చాలా కష్టమని చెప్పి పంపించేశానని ఆయన చెప్పారు. తన జీవితం తొమ్మిదో ఏట నుంచే ప్రారంభమైందని... సినిమా తీయడానికి ఒక భాగం సరిపోదని, రెండు భాగాలు కావాలని తెలిపారు. మరోవైపు, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మకథను దాసరి తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. 

More Telugu News