చిరంజీవి సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ దూరం... కారణమిదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ దూరం... కారణమిదే!

సస్పెన్స్ వీడిపోయింది. అన్నయ్య చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ రావడం లేదనే విషయం స్పష్టమయింది. చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రంలో అభిమానుల ఫోకస్ అంతా ఆయన మీదే ఉండాలని... తాను ఫంక్షన్ కు వస్తే ఫోకస్ డివైడ్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫంక్షన్ కు హాజరుకాకూడదనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్టు తెలుస్తోంది. గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో ఈ రోజు 'ఖైదీ' ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. పవన్ మినహా మెగా హీరోలంతా ఈ ఫంక్షన్ కు హాజరవుతున్నారు.

మరోవైపు, పవన్ కల్యాణ్ చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ హైదరాబాదులోని గోల్కొండ కోటలో జరుగుతోంది. గత కొంత కాలంగా మెగా హీరోలందరి అభిమానులంతా కలసికట్టుగా ఉంటున్నప్పటికీ... పవన్ అభిమానులు మాత్రం వీరితో కొంచెం గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారు. మెగా హీరోల ఫంక్షన్లలో కూడా పవన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తుండటం వీరికి పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో, తాను ఫంక్షన్ కు హాజరయితే... అభిమానులు రెండుగా చీలిపోయే అవకాశం ఉందనేది పవన్ భావనట.

More Telugu News