: చంద్రబాబు పర్యటన వేళ..జిలెటిన్ స్టిక్స్ కలకలం!


అనంతపురం జిల్లా బుక్కపట్నంలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈరోజు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణించే మార్గంలో బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. పుట్టపర్తి-బుక్కపట్నం మార్గంలో కాలం చెల్లిన రెండువందల జిలెటిన్ స్టిక్స్ ను గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హంద్రీనీవా కాలువ తవ్వకంలో పేలుళ్లకు ఉపయోగించే నిమిత్తం వీటిని తీసుకువచ్చారని, మిగిలిపోయిన జిలెటిన్ స్టిక్స్ ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. కాగా, కొద్దిసేపటి క్రితం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు, అక్కడి నుంచి బుక్కపట్నంకు బయలుదేరారు.

  • Loading...

More Telugu News