: మీడియాకూ చురకలంటించిన ఎన్నికల కమిషన్!


ప్రతి ఎన్నికల్లోను అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని, తమ పేపర్లలో వారికి అనుకూలంగా వార్తలు రాస్తున్న పత్రికలకు ఎలక్షన్ కమిషన్ చురకలు అంటించింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల విజయవంతానికి మీడియా సహకారం తప్పనిసరి అంటూనే, పెయిడ్ వార్తలు రాసే పత్రికలకు అందే అన్ని రకాల ప్రోత్సాహకాలనూ తొలగిస్తామని హెచ్చరించింది. ఏ అభ్యర్థి గురించైనా పూర్తి అనుకూలంగా, ఏకపక్షంగా వచ్చే వార్తల వివరాలను సమీకరించి, తమకు అందించేందుకు ప్రెస్ కౌన్సిల్ తరఫున కమిటీని నియమించామని, వారిచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తప్పవని పేర్కొంది.

కొన్ని టీవీ చానళ్లు పొలిటికల్ పార్టీలు, కొంతమంది అభ్యర్థుల అధీనంలో నడుస్తున్నాయన్న విషయం తమకు తెలుసునని, ఈ టీవీ చానళ్లలో తమకు సంబంధించిన వారి గురించి వార్తలు, ప్రచారం వస్తే, మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసింది. ప్రతి వార్తనూ పరిశీలించి, దాన్ని వాణిజ్య ప్రకటనగా పరిగణించి, అభ్యర్థి ఖర్చులో జమ చేయనున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News