నోట్ల క‌ష్టాలు త‌గ్గుముఖం ప‌డుతున్న వేళ‌.. మ‌రో బాంబు పేల్చిన బ్యాంకులు!

03-01-2017 Tue 08:53 | National
నోట్ల ర‌ద్దుతో పెరిగిన క‌ష్టాలు ఇప్పుడిప్పుడే కాస్తంత త‌గ్గుముఖం ప‌డుతున్న వేళ వినియోగ‌దారుల నెత్తిపై బ్యాంకులు మ‌రో బాంబు వేశాయి. ఏటీఎం ట్రాన్సాక్ష‌న్స్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌డ‌లింపును ఎత్తివేశాయి. న‌వంబ‌రు 8వ తేదీకి ముందు ఉన్న నిబంధ‌న‌ల‌ను తిరిగి అమ‌లు చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. నిజానికి నోట్ల ర‌ద్దుతో మొద‌లైన క‌ష్టాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఏటీఎంలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానేలేదు. అయినా ఏటీఎం చార్జీల రూపంలో ఖాతాదారుల‌ ముక్కు  పిండేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డంతో ప్ర‌జ‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత డ‌బ్బులు దొర‌క‌డం గ‌గ‌నంగా మారిన నేప‌థ్యంలో డిసెంబ‌రు 31 వ‌ర‌కు డెబిట్ కార్డును ఏటీఎంలో ఎన్నిసార్లు ఉప‌యోగించినా ఎటువంటి చార్జీలు వ‌సూలు చేయ‌బోమ‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌జ‌ల‌కు ఎంతో ఊర‌ట‌నిచ్చింది. అయితే గ‌డువు ముగిసినా ప్ర‌జ‌ల క‌ష్టాల్లో మార్పులేదు. దీనికి తోడు ఆర్బీఐ నుంచి ఈ విష‌యంలో ఎటువంటి ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఊపిరి  పీల్చుకున్నారు. అయితే నిన్న అక‌స్మాత్తుగా వినియోగ‌దారుల మొబైల్ ఫోన్ల‌కు మెసేజ్‌లు వెల్లువెత్త‌డంతో కంగుతిన్నారు.

ఏటీఎంల నుంచి జ‌రిపే తొలి ఐదు లావాదేవీల‌కు బ్యాంకులు ఎటువంటి చార్జీలు వ‌సూలు చేయ‌వు. ఆ  ప‌రిమితి దాటితే మాత్రం సర్వీస్ చార్జీలు వ‌సూలు చేస్తున్నాయి. నోట్ల ర‌ద్దుకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, ఐసీఐసీఐ త‌దిత‌ర బ్యాంకులు  ప‌రిమితి దాటిన త‌ర్వాత ఒక్కో ట్రాన్సాక్ష‌న్‌కు రూ.15 వ‌సూలు చేస్తుండ‌గా.. ఇత‌ర బ్యాంకులు రూ.20 వ‌సూలు చేస్తున్నాయి. కాగా డెబిట్ కార్డుల ట్రాన్సాక్ష‌న్స్‌పై తిరిగి స‌ర్వీసు చార్జీలు వ‌సూలు చేయ‌నున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై ఎస్బీఐ, పంజాబ్ నేష‌నల్ బ్యాంకులు మాట్లాడేందుకు నిరాక‌రించ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more