ఆ ఏడు మండ‌లాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినా లాభం లేదని చెప్పాను: చ‌ంద్ర‌బాబు

30-12-2016 Fri 15:32 | Andhra
పోలవరం ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి  ఒక‌ వరమని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు పోల‌వ‌రం కాంక్రీటు ప‌నుల‌ను ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో క‌ర‌వు తొలిగిపోతుందని చెప్పారు. ప్ర‌భుత్వ పాల‌నను అమ‌రావ‌తికి తీసుకొచ్చామ‌ని, రాష్ట్ర‌ ద‌శ‌, దిశ ఇక మారతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి  పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయాల‌న్న చిత్తశుద్ధి లేదని అన్నారు. అందుకే రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏడు మండ‌లాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో ఉంచిందని చెప్పారు

అసలు ముంపున‌కు గుర‌య్యే మండ‌లాల‌ని తెలంగాణ‌లో వుంచి, పోల‌వ‌రం ప్రాజెక్టు క‌ట్టాలంటే అది ఎలా సాధ్య‌మ‌వుతుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తాను అధికారంలోకి రాగానే తాను ప్ర‌మాణ స్వీకారం చేయ‌కముందే ఢిల్లీకి వెళ్లి ఆ ఏడు ముంపు మండ‌లాల‌ను ఏపీలో క‌ల‌పాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. ముంపు మండ‌లాలు కావాల‌ని గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు చెప్పారు.

‘ఆ ఏడు మండ‌లాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినా లాభం లేదని చెప్పాను. ఆ ముంపు మండ‌లాలు నాకు కావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడిగాను. చివ‌రికి అవి ఏపీలో క‌లిశాయి. ఇప్పుడు మ‌నం క‌ల‌లు క‌న్న పోల‌వ‌రం నిజ‌మ‌వుతోంది. పోల‌వ‌రం ప‌నుల‌పై ప్ర‌తి సోమ‌వారం స‌మీక్ష చేస్తున్నాను.  కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం వ‌ల్లే పోల‌వ‌రం ప‌నులు వేగంగా ముందుకు వెళుతున్నాయి.  గోదావ‌రి పుష్క‌రాల వేళ నేను గోదావ‌ర‌మ్మ‌ను కోరుకున్న‌ది ఒక్క‌టే. పోల‌వ‌రం పూర్తి కావాల‌ని గోదావ‌రి త‌ల్లిని కోరుకున్నాను’ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.
chandrababupolavaram

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more