: హైదరాబాద్ శివారులో కనిపించకుండా పోయిన తల్లి, ఇద్దరు పిల్లలు!


రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి ఆసుపత్రిక‌ని త‌న‌ పిల్లలు ప్రవళిక, నర్సింహాలతో వెళ్లిన ఓ మ‌హిళ మ‌ళ్లీ ఇంటికి తిరిగి రాకుండా పోయిన ఘ‌ట‌న హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్‌లో చోటుచేసుకుంది. త‌న భార్యాపిల్ల‌లు క‌నిపించ‌డం లేదంటూ ఈ రోజు ఉద‌యం ఓ వ్య‌క్తి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. త‌న భార్యాపిల్ల‌ల కోసం తనకు తెలిసినవారి ఇళ్లల్లో, త‌న గ్రామంలో మొత్తం వెతికాన‌ని అయినా క‌నిపించ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News