న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆన్‌లైన్ షాపింగ్ సైట్ మింత్రా

29-12-2016 Thu 15:57 | Offbeat
ఆన్‌లైన్ షాపింగ్ సైట్ మింత్రా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌మ క‌స్ట‌మ‌ర్ల ముందుకు భారీ ఆఫ‌ర్‌ను తీసుకురానుంది. 'ఎండ్ ఆఫ్ రీజన్' సేల్ పేరిట వ‌చ్చే జనవరి 3వ తేదీ నుంచి 5 వ‌ర‌కు 1,800 బ్రాండులకు చెందిన షూస్, క్లాత్స్ వంటి అన్ని ఫ్యాషన్ వస్తువులను 50 నుంచి 80 శాతం డిస్కౌంట్తో విక్ర‌యించ‌నున్న‌ట్లు పేర్కొంది. న‌గ‌దుర‌హిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేసేవారికి ఆ డిస్కౌంట్ శాతం మ‌రింత ఎక్కువ‌గా అందిస్తామ‌ని తెలిపింది. ఈ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చి తమ అమ్మకాల‌ను మ‌రింత పెంచుకోవాల‌ని చూస్తోంది. దేశంలో పెద్ద‌నోట్ల ర‌ద్దుతో త‌గ్గిపోయిన అమ్మ‌కాల‌ను ఈ భారీ డిస్కౌంట్ ద్వారా మ‌ళ్లీ పుంజుకునేలా చేసుకోవాల‌ని యోచిస్తోంది.

మింత్రా సైటు యజమాన్య సంస్థ అయిన‌ ఫ్లిప్కార్ట్కు ఈ ఆఫ‌ర్ లాభాల‌ను తెచ్చిపెడుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. న‌వంబ‌రు 8 త‌రువాత ఫ్లిప్కార్ట్ వృద్ధి రేటు 50 శాతం మేర ప‌డిపోయింది. త‌మ సంస్థ‌ సాధారణ రోజుల కంటే ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ ఈవెంట్లో త‌మ విక్ర‌యాల‌ను ఎన్నో రెట్లు అధికం చేసుకుంటామ‌ని, ఈ ఈవెంట్‌ను ఏడాదికి రెండు సార్లు నిర్వ‌హిస్తామ‌ని మింత్రా సీఈవో ఆనంత్ నారయణన్ చెప్పారు. ఈ ఏడాది జులైలోనూ ఈవెంట్‌ను నిర్వహించామ‌ని, అయితే, ఇప్పుడు దానికంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తామని అన్నారు. ఈ ఈవెంట్ లో 15 మిలియన్ ప్రజలు కొనుగోళ్లు చేస్తార‌ని, 5 నుంచి 6 లక్షల మ‌ధ్య‌ కొత్త కస్టమర్లను పొందుతామని ఆయ‌న పేర్కొన్నారు.
myntra offer

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more