శ‌శిక‌ళ పుష్ప భ‌ర్త లింగేశ్వ‌ర్‌ తిల‌క‌న్‌పై అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌ల దాడి.. ర‌క్త‌మోడుతున్నా వ‌దిలిపెట్ట‌ని వైనం

29-12-2016 Thu 06:20 | National
రాజ్య‌స‌భ  స‌భ్యురాలు, అన్నాడీఎంకే  నుంచి స‌స్పెండైన శశిక‌ళ పుష్ప భ‌ర్త లింగేశ్వ‌ర్‌ తిల‌క‌న్‌పై అన్నాడీఎంకే పార్టీ కార్య‌క‌ర్తలు దాడి చేసి చిత‌క‌బాదారు. ర‌క్త‌మోడుతున్నా వ‌దిలి పెట్ట‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్టు ముష్టిఘాతాలు కురిపించారు.   నోరు, ముక్కులో నుంచి రక్తం కారుతున్నా ఆయ‌న‌ను వ‌దిలిపెట్ట‌లేదు. చివ‌రికి పోలీసులు ఆయనను ర‌క్షించి ఆస్ప‌త్రిలో చేర్పించారు.

నేడు జ‌ర‌గ‌నున్న పార్టీ సర్వస‌భ్య స‌మావేశంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ర్శిని ఎన్నుకోనున్నారు. ఈ ప‌దవికి శ‌శిక‌ళ పుష్ప‌ కూడా పోటీప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం శ‌శిక‌ళ భ‌ర్త లింగేశ్వ‌ర్ ఐదుగురు న్యాయ‌వాదుల‌తో క‌లిసి స్థానిక రాయ‌పేట‌లో ఉన్న అన్నాడీఎంకే కార్యాల‌యానికి చేరుకున్నారు. అనంత‌రం నామినేష‌న్ ప‌త్రాన్ని కొనుగోలు చేశారు. దానిని పూర్తిచేసి శ‌శిక‌ళ  పుష్ప త‌ర‌పున నామినేష‌న్ వేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా అన్నాడీఎంకే కార్య‌క‌ర్తలు ఒక్క‌సారిగా ఆయ‌న‌పై దాడిచేశారు.

పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న విధ్వంసం సృష్టించేందుకు, గొడ‌వులు పెట్టేందుకే వ‌చ్చార‌ని ఆరోపిస్తూ ముష్టిఘాతాలు కురిపించారు. భ‌ర్త‌పై దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో శశిక‌ళ పుష్ప కార్యాల‌యం బ‌య‌ట కారులోనే ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా త‌న భ‌ర్త క‌నిపించ‌డం లేదంటూ శ‌శిక‌ళ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌రోవైపు అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు కూడా శ‌శిక‌ళ భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more