: హైదరాబాద్ లో భారీ దోపిడీ... ముత్తూట్ ఫైనాన్స్ లో 50 కిలోల బంగారం అపహరణ


హైదరాబాద్ పరిధిలోని రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ లో గత రాత్రి భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ శాఖలోకి ప్రవేశించిన దుండగులు 50 కిలోల బంగారు నగలను అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల్లో నమోదైన వివరాలను బట్టి ఎరుపు రంగు స్కార్పియోలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. మారణాయుధాలతో వచ్చిన వీరు సెక్యూరిటీ గార్డును బెదిరించి, బంధించి దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ ఉదయం ఫిర్యాదును అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఇది పాత నేరస్తుల పని అయివుండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News