నోట్ల ర‌ద్దుకు నేటితో హాఫ్ సెంచ‌రీ.. బౌండ‌రీలు దాటుతున్న‌ క‌ష్టాలు!

28-12-2016 Wed 07:59 | National
మొత్తానికి నోట్ల ర‌ద్దు  నిర్ణ‌యం వెలువ‌డి నేటికి 50 రోజులు. మంచి రోజులు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు ఇన్ని రోజుల‌పాటు మౌనంగా త‌మ క‌ష్టాల‌ను భరించారు. రోజురోజుకు త‌మ ఇక్క‌ట్లు త‌గ్గుతూ వ‌స్తాయ‌ని మురిసిపోయారు. అదే సమ‌యంలో న‌ల్ల‌కుబేరుల‌కు క‌ష్ట‌కాలం మొద‌లైంద‌ని తెగ సంతోష‌ప‌డిపోయారు. దీనికి తోడు యాభై రోజుల త‌ర్వాత ప్ర‌జ‌ల క‌ష్టాలు త‌గ్గి అవినీతి ప‌రుల‌కు క‌ష్టాలు పెరుగుతాయ‌ని ప్ర‌ధాని మోదీ కూడా చెప్పారు. మ‌రి ప్ర‌ధాని చెప్పిన‌ట్టు సామాన్యుల క‌ష్టాలు తీరిపోయాయా? న‌ల్ల‌బాబుల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌డం కొంచెం క‌ష్ట‌మైన ప‌నే. కొంచెం వివ‌రంగా చెప్పుకుంటే..

దేశంలో విప‌రీతంగా సంప‌దను పోగేసుకున్న న‌ల్ల‌బాబుల‌ను ఏమీ చేయ‌లేని సామాన్యులు పెద్ద నోట్ల ర‌ద్దుతో 'మంచి ప‌ని' జ‌రిగింద‌ని సంబ‌ర‌ప‌డ్డారు. అయితే వారికేదో జ‌రిగిపోతుంద‌ని భావించిన ప్ర‌జ‌ల‌కు ఆ త‌ర్వాత జ‌రిగిన  ప‌రిణామాలు తీవ్ర నిరాశ‌ను మిగిల్చాయి. మ‌రోవైపు 50  రోజుల త‌ర్వాతైనా చేతికి చాలిన‌న్ని డ‌బ్బు వ‌స్తాయ‌ని భావించిన వారికి స‌ర్కారు న‌గ‌దు ర‌హితం అంటూ చావుక‌బురు చ‌ల్ల‌గా చెప్ప‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నారు.

మౌలిక వ‌స‌తులు కూడా స‌రిగా లేని దేశంలో 'క్యాష్‌లెస్' ఏంటంటూ ఎగ‌తాళి వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌భుత్వం మాత్రం వీటిని  పట్టించుకోకుండా ముందుకే వెళ్తోంది. అదే స‌మ‌యంలో దేశంలో బినామీల పేరుతో పేరుకుపోయిన ఆస్తుల‌ను లాక్కునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. త్వ‌ర‌లో సంచ‌ల‌నాత్మ‌క చ‌ర్య‌ల‌కు దిగే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. వివిధ రూపాల్లో సంప‌ద‌ను పోగేసుకున్న ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌కూడ‌ద‌నే కృత‌నిశ్చ‌యంతో ప్ర‌భుత్వం ఉంది. అదే క‌నుక జ‌రిగితే క‌ష్టాల‌ను పంటికింద బాధ‌ను అణ‌చిపెట్టుకుని నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న ప్ర‌జ‌ల‌కు మోదీ 'రాబిన్‌హుడ్' అవుతారు. లేదంటే న‌ల్ల‌కుబేరుల‌ను ఏమీ చేయలేక, ఏదో చేయాలని ఆశించి చివ‌రికి ప్ర‌జ‌ల‌ను క‌ష్టాల‌పాలు చేసిన ప్ర‌ధానిగా మిగిలిపోతార‌ని ఆర్థిక‌రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇక నోట్లు ర‌ద్దు నిర్ణ‌యం వెలువ‌డి నేటికి 50 రోజులు అయినా దేశంలో ఇంకా 80 శాతం ఏటీఎంలు ఖాళీగానే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఆర్బీఐ నుంచి డ‌బ్బులు ఇదిగో వ‌చ్చేస్తున్నాయి, అదిగో వ‌చ్చేస్తున్నాయి అని చెబుతున్న ప్ర‌భుత్వం మాట‌లు ఉత్తివేన‌ని తేలిపోతున్నాయి. బ్యాంకుల్లో డ‌బ్బులు ఇవ్వ‌క‌, ఏటీఎంల‌లో రాక ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు అక‌స్మాత్తుగా ఏదైనా ఊహించ‌ని అద్భుతం జ‌రిగితే త‌ప్ప ప్ర‌జ‌ల క‌ష్టాల‌కు పుల్‌స్టాప్ ప‌డ‌దు. అనుకున్న‌ట్టు ప్ర‌ధాని వద్ద 50 రోజుల కష్టాల‌కు పుల్‌స్టాప్ పెట్టే మంత్ర‌దండం ఉంటే త‌ప్ప సామాన్యుల‌కు మ‌రో రెండునెల‌లు అష్ట‌క‌ష్టాలు త‌ప్ప‌వ‌న్న‌మాటే.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more