: అక్కడికి వెళ్లి ఫొటో దిగితే చాలు.. మీకు నచ్చిన ఆహారాన్ని ఆ మిషనే ఆర్డర్‌ చేసేస్తుంది


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌ చెయిన్‌ కెంటకీ ఫ్రైడ్‌ చికెన్‌ (కేఎఫ్‌సీ) చైనా రాజధాని బీజింగ్‌లో ఓ స్పెష‌ల్ బ్రాంచిని ఓపెన్ చేసింది. ఆ రెస్టారెంట్‌ వద్ద పెట్టిన మెషిన్‌ ముందు క‌స్ట‌మ‌ర్లు నిలబడి ఫొటోలు తీసుకుంటే చాలు, ఈ మిష‌న్ క‌స్ట‌మ‌ర్ల ముఖం, వయసు, హావభావాల సాయంతో వారికి ఏ రక‌మైన ఆహారం న‌చ్చుతుందో క‌నుక్కొని ఆటోమెటిక్‌గా ఆ ఆహార ప‌దార్థాల్ని ఆర్డరు చేస్తుంది. ఒకవేళ కస్టమర్ మ‌రోసారి మిష‌న్ ముందు నిల‌బ‌డి ఫొటో దిగితే ఆ క‌స్ట‌మ‌ర్‌ ఇంతకుముందు వచ్చి ఆర్డర్‌ తీసుకున్న వివరాలను కూడా తెలుపుతుంది.

 స‌ద‌రు కస్టమర్‌కి అతను తినే అలవాట్లను బట్టి వెంట‌నే ఆహార‌ప‌దార్థాల్ని ఆర్డర్ చేస్తుంది. ఆ దేశంలోని ప్రముఖ సెర్జ్‌ ఇంజిన్‌ బైడూ ఇన్‌కార్పొరేషన్‌ ఇన్‌స్టిట్యూట్ ఈ మెషీన్ త‌యారీకి సహకరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేఎఫ్‌సీ షాంఘైలో తొలి చైనీస్‌ స్మార్ట్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించి, అందులో మొత్తం రొబోటిక్‌ టెక్నాలజీతోనే ఆర్డ‌ర్లు చేయ‌డంతో పాటు అన్ని స‌ర్వీసుల‌ను అందిస్తోంది.

  • Loading...

More Telugu News