: వంగవీటి రాధాకు ఘాటుగా సమాధానం చెప్పిన దర్శకుడు వర్మ


‘వంగవీటి’ చిత్రంలో రంగా పాత్రను సరిగా చిత్రీకరించలేదని ఆరోపించిన వంగవీటి రాధాకృష్ణకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘రంగాగారు బోసిపళ్ల మహాత్మా గాంధీ అని చూపించాలా? మర్డర్ల మాట అటుంచి ఎవర్ని మొట్టికాయ కూడా మొట్టలేదని చూపించాలా? మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా? అన్నదానాలు, ప్రజాసేవ తప్ప, చీమకైనా హాని చేయని గౌతమ బుద్ధుడని చూపించాలా? రంగా గారి గురించి, ఆయన భార్య గురించి, రంగా గారి అభిమానులు వినటానికి, చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు నేను చాలా చూపించగలను. కానీ, రంగా గారిపై ఉన్న గౌరవంతో నేను ఆ పని చేయలేదు. వాస్తవాలు ఏమిటని రాధా డిమాండ్ చేస్తే, వాటన్నింటినీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. వంగవీటి సినిమా తీయడంలో నా ఉద్దేశం.. ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనుక వాళ్ల సున్నితమైన భావోద్వేగాలను చూపించడం మాత్రమే. ఒరిజినల్ వంగవీటి రాధా, వంగవీటి రంగా గార్లలో ఉన్న గొప్పతనంలో, ఈ రాధాకి 0.1 శాతం కూడా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి’ అని వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. మరి దీనిపై రాదా ఎలా ప్స్సందిస్తారో చూడాలి! 

  • Loading...

More Telugu News